ఎవర్‌గ్రీన్ శ్రీదేవి నటించిన క్లాసిక్ చిత్రం చాల్‌బాజ్.ఈ సినిమా రీమేక్‌లో ఆమె కుమార్తె జాన్వి కపూర్ ప్రధాన పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ వార్తతో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాన్వి, శ్రీదేవి స్థాయిని అందుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముందుగా ఈ రీమేక్‌ను శ్రద్ధా కపూర్‌తో ప్రకటించినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడు జాన్వి పేరుతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జాన్వికి చాల్‌బాజ్ సినిమా కేవలం సినిమా కాదు, అది ఒక భావోద్వేగం… అవకాశం వచ్చిన వెంటనే ఆసక్తి చూపినా, తాను చేసే ప్రతి అడుగు జాగ్రత్తగానే వేస్తోంది.
అయితే, నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహంతో స్పందిస్తున్నారు. ఏమిటీ???????? అస్సలు సాధ్యం కాదు! మా బాల్యం జ్ఞాపకాలను, ప్రియమైన సినిమాలను చెడగొట్టకండి అంటూ రాశారు. మరొకరు — “ఒక పాత్రలోనే ఒప్పించలేరు, రెండు పాత్రలతో ఎలా సాధ్యం?” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.ఇంకో నెటిజన్ — “ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే శ్రీదేవి స్థాయికి రావడం అసాధ్యం. ఆమెపై ట్రోలింగ్ రెట్టింపు అవుతుంది” అని వ్యాఖ్యానించారు.
Also Read:తెలంగాణ స్థానికతపై సుప్రీం సంచలన తీర్పు

