రెండు రోజుల క్రితం అల్లుఅర్జున్‌కు బామ్మ అల్లు కనకరత్నం (94) మరణించిన సంగతి తెలిసిందే. ఈ వార్తతో కుటుంబంలో విషాదం నెలకొనగా, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, త్రివిక్రమ్ సహా పలువురు సానుభూతి తెలియజేశారు.
అంత్యక్రియలు ముగిసిన వెంటనే ముంబైకి వెళ్లి AA22xA6 షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో బన్నీ కమిట్‌మెంట్ చూసి అంతా ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు. అలాగే బాధను పక్కకుపెట్టి సెట్‌లో అల్లుఅర్జున్ చేసిన డాన్స్ మూవ్స్‌కి యూనిట్ ఆశ్చర్యపోయింది. ఆయన ప్రదర్శన అంత అద్భుతంగా ఉండటంతో అందరూ చప్పట్లు కొట్టారని సమాచారం.
దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే, సినిమా 2027 ఆరంభంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. బన్నీ సరసన హీరోయిన్‌గా దీపికా పదుకొనే ఇప్పటికే ఖరారైంది. రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటించనున్నారని టాక్. సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
Also Read:శ్రీదేవికి జాన్వికి పోలికా..నెటిజన్ల ఫైర్!

