తెలంగాణ స్థానికతపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలోనే చదవాల్సిందేనన్న ప్రభుత్వ వాదనను సమర్థించింది సుప్రీం. ఇందుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం స్థానికతపై ఇచ్చిన జీవో 33 ప్రకారమే రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. తెలంగాణలో మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
Also Read:SCO:మోడీ, పుతిన్, షీ జిన్‌పింగ్ ఒకే ఫ్రేంలో!
ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సమర్థించింది. గతంలో రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందే అన్న నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది.

