- Advertisement -
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట మార్చారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించారు మోహన్ భగవత్.ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసినవేనని పెద్ద దుమారం చెలరేగింది.
అయితే తాజాగా ఆ మాట మార్చి 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉంది… సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటాం అని తెలిపారు.
గతంలో ఓ సభలో మాట్లాడుతూ… రాజకీయ నాయకులు 75 ఏళ్లకు రిటైర్ కావాలి అన్నారు మోహన్ భగవత్. రాజకీయ నాయకులకు 75 ఏళ్ల వయసు వచ్చాక, హుందాగా తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలి అని కామెంట్ చేశారు.
Also Read:సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం పొడగింపు
- Advertisement -

