బిహార్ ప్రజల ఓట్లను బీజేపీ, ఎన్నికల సంఘం దొంగిలిస్తే ఊరుకోమని హెచ్చరించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బిహార్‌లోని సీతామఢీలో నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ …బిహార్లో ఓట్ల దొంగిలించడాని ప్రయత్నిస్తున్నారని మాకు తెలుసు కానీ బిహార్ ప్రజలు తెలివైనవారు అన్నారు.
బీజేపీ, ఎన్నికల కమిషన్ బిహార్లో ఒక్క ఓటును కూడా దొంగిలించనివ్వరని తెలుసుకోవాలి…. మేం ఇక్కడ ఓటర్ అధికార్ యాత్రలో ప్రారంభించాం అన్నారు. బిహార్ ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది పేదల పేర్లు తొలగించారని పేర్కొన్నారు. ఓట్ల చోరీ జరిగిందని నిరూపించేందుకు భవిష్యత్లో మరిన్ని ఆధారాలు చూపిస్తానని చెప్పారు.
ఇది కేవలం ఓటు హక్కు గురించి కాదు. ఎందుకంటే ఓటు పోతే భారత్లోని పేద ప్రజలకు ఏం మిగలదు. ఓటుతో మొదలై తర్వాత రేషన్ కార్డ్, భూమి అలా ప్రతిదీ పోతుంది అని తెలిపారు. ఈ యాత్రలో బిహార్ ప్రజలు మాకు తోడుగా ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటివరకు, నేను కర్ణాటకకు మాత్రమే రుజువు ఇచ్చా… రాబోయే కాలంలో, లోక్‌సభ ఎన్నికలు, హరియాణా ఎన్నికల్లో కూడా ఓట్ల చోరీ జరిగిందిని ఆధారాలు ఇస్తానని చెప్పారు.
Also Read:నిద్రమత్తులో కాంగ్రెస్ నేతలు..హరీష్ ఫైర్

