బంగాళాఖాతంలో అల్పపీడనం!

4
- Advertisement -

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండనుందని తెలిపారు.

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరిలో భారీ వర్షాలు.. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు, తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.

ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగి పొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.

Also Read:అమెరికాలో ఘనంగా ఇండియా డే పెరేడ్

- Advertisement -