రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..దసరా, దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లో 22 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సెప్టెంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని చెప్పారు.
సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నాలుగు సర్వీసులు, సెప్టెంబర్ 5 నుంచి 26వ తేదీ వరకు తిరుపతి – సికింద్రాబాద్ మధ్య నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు చెప్పారు.
సెప్టెంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు కాచిగూడ – నాగర్‌సోల్ మధ్య నాలుగు సర్వీసులు, సెప్టెంబర్ 5 నుంచి 26వ తేదీ వరకు నాగర్ సోల్ – కాచిగూడ మధ్య నాలుగు సర్వీసులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సంత్రాగ్జి – చర్లపల్లి మధ్య మూడు సర్వీసులు, సెప్టెంబర్ 20నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు చర్లపల్లి – సంత్రాగ్జి మధ్య మూడు సర్వీసులు ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
Also Read:బంగాళాఖాతంలో అల్పపీడనం!

