August 15: ఆ దేశాలకు ముఖ్యమైన రోజు

9
- Advertisement -

ఆగస్టు 15..భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవే కాదు ఆ దేశాలకు కూడా ముఖ్యమైన రోజు. భారత్ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, న్యూ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. అయితే, ఆగస్టు 15న స్వాతంత్ర్యం జరుపుకునే ఏకైక దేశం భారత్ మాత్రమే కాదు మరిన్ని దేశాలు కూడా ఉన్నాయి.

కొరియా (ఉత్తర మరియు దక్షిణ): జపాన్ ఆక్రమణ నుంచి విముక్తి. ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా రెండూ ఆగస్టు 15న విముక్తి దినోత్సవం జరుపుకుంటాయి. ఇది 1945లో 35 సంవత్సరాల జపాన్ ఆక్రమణ ముగిసిన రోజు.

1971 ఆగస్టు 15న, ఐక్యరాజ్య సమితి సర్వే ప్రజల అభిప్రాయాన్ని ధృవీకరించిన తర్వాత బహ్రెయిన్… బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించింది. కానీ దీని బదులుగా బహ్రెయిన్ డిసెంబర్ 16న ఎమిర్ ఈసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సింహాసనారోహణ దినోత్సవాన్ని జాతీయ దినంగా జరుపుకుంటారు.

కాంగో గణరాజ్యం..ఫ్రెంచ్ ఈక్వటోరియల్ ఆఫ్రికాలో భాగమైన కాంగో గణరాజ్యం, 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం పొందింది.

లిక్టెన్‌స్టైన్‌కి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం కాదు, కానీ వారు దీన్ని అధికారిక జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. 1940లో జరిగిన రెండు సంఘటనలు మరియమ్మ స్వర్గారోహణ పండుగ మరియు ప్రిన్స్ ఫ్రాంజ్ జోసెఫ్ II జన్మదినం. ఈ రోజున ఆ దేశ పౌరులు రాజధాని వాడుజ్‌లోని రాజభవనం సమీపంలో జరిగే వేడుకలకు హాజరవుతారు.

Also Read:సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

- Advertisement -