కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన..

11
- Advertisement -

పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు వినూత్న ప్రదర్శన చేపట్టారు. మింతాదేవి బొమ్మతో కూడిన టీ షర్టులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇటీవల విడుదలైన బీహార్ ముసాయిదా ఓటరు జాబితాలో మొట్టమొదటి ఓటరుగా నమోదు చేసుకుంది మహిళ మింతాదేవి.

ఆమె వయసు 124 సంవత్సరాలు. ‘124 నాట్ అవుట్’ అనే నినాదాన్ని టీ షర్ట్‌పై రాసుకుని ఎంపీలు ప్రదర్శణ చేపట్టారు.

బీజేపీ- ఈసీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటు చోరి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలే కాదు సాక్ష్యాధారాలను సైతం చూపించారు రాహుల్. ఈ నేపథ్యంలో నిన్న ఆందోళన చేపట్టిన ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేయగా ఇవాళ వినూత్న నిరసన చేపట్టారు కాంగ్రెస్ ఎంపీలు.

Also Read:కోమటిరెడ్డి-ఉత్తమ్..ఇద్దరూ అసమర్ధులే!

- Advertisement -