రేవంత్ రెడ్డి ఏ మీడియాను వాడుకొని మా మీద దుష్ప్రచారం చేసి గెలిచిండో.. ఈరోజు వాళ్లనే కొట్టాలనిపిస్తుందట అని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అశోక్ నగర్ ఇష్టమైన ప్రాంతమని నిరుద్యోగులను వాడుకొని.. ఇప్పుడు అశోక్ నగర్ అంటే వణుకుతున్నాడు అని దుయ్యబట్టారు.
వెంటనే 2 లక్షల రుణాలు తెచ్చుకోండి అని చెప్పి.. ఇప్పుడు రైతులను చూసి భయపడుతున్నాడు… తమ్మీ నీకు 5 లక్షల కార్డు ఇస్తాం అన్నడు.. చెల్లే నీకు స్కూటీ ఇస్తా అన్నడు .. ఇప్పుడు అవన్నీ అడిగితే రేవంత్ రెడ్డికి మీడియా వాళ్లు, నిరుద్యోగులు ఆవారా గాల్ల లెక్క కనిపిస్తున్నారు అని మండిపడ్డారు.
ఈ పాదయాత్రకు “మిషన్ మీనాక్షి” అని పేరు పెడితే బాగుండేది అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నాడని మీనాక్షి నటరాజన్ పాదయాత్ర మొదలు పెట్టింది అన్నారు. ఇది ప్రజాహిత పాదయాత్ర కాదు.. ప్రజాహత పాదయాత్ర… ఏదో పెళ్లి బరాత్ లెక్క ట్రాఫిక్ జాములు చేసి జనాలను సావగొడుతున్నారు… పాలన చేతగాకనే పాదయాత్ర మొదలు పెట్టిండు అన్నారు.
Also Read:టెస్లాకు షాకిచ్చిన ఫ్లోరిడా కోర్టు

