శాండల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టి సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ డ్రామాలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. 18వ శతాబ్దం బెంగాల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది టాక్. జై హనుమాన్ తర్వాత టాలీవుడ్‌లో రిషబ్‌కి రెండో పాన్-ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం.
టాలీవుడ్ వర్గాల కథనం ప్రకారం… సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మాత నాగ వంశీ, రిషబ్ శెట్టికి ఈ సినిమాలో నటించేందుకు ఏకంగా రూ. 55 కోట్లు పారితోషికంగా ఇవ్వనున్నారని సమాచారం. ఇది నిజమైతే, రిషబ్ శెట్టికి ఇప్పటివరకు లభించిన అత్యధిక రెమ్యూనరేషన్ అవుతుంది. ఇది ఆయనకు శాండల్‌వుడ్లో లభించే పారితోషికానికి మూడు రెట్లు ఎక్కువ.
Also Read:KVN ప్రొడక్షన్స్‌తో బాబీ!
కాంతారా చిత్రానికి నటించి దర్శకత్వం వహించినందుకు రిషబ్ శెట్టికి సుమారు రూ. 2 కోట్లు చెల్లించారట. ఆ చిత్రం సంచలన విజయంతో, రిషబ్ రెమ్యూనరేషన్ కాంతారా ప్రిక్వెల్ కోసం రూ. 12 కోట్లకు పెరిగింది. తాజా పాన్-ఇండియా చిత్రానికి రూ. 55 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారన్న మాట నిజమైతే ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకున్న తొలి కన్నడ హీరో కానున్నారు రిషబ్.

