- Advertisement -
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లాకు భారీ షాకిచ్చింది ఫ్లోరిడా కోర్టు. టెస్లాకు 242 మిలియన్ డాలర్లు(రూ.2100 కోట్లు) భారీ జరిమానా విధించింది ఫ్లోరిడా కోర్టు. 2019లో ఫ్లోరిడాలోని కీ లార్గోలో తన టెస్లా కారును ఆటో పైలట్ మోడ్ లో పెట్టి డ్రైవ్ చేశారు టెస్లా యజమాని జార్జ్ మెక్‌గీ.
ఈ క్రమంలో 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఒక కారును ఢీకొట్టి, పక్కనే ఉన్న జంట పైనుండి దూసుకుపోయింది టెస్లా కారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే యువతి మరణించగా ఆమె ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ కేసు కోర్టులో నడుస్తుండగా, ఆటో పైలట్ సిస్టం వల్లే ఒకరి ప్రాణాలు పోయాయి, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని టెస్లాకు 242 మిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించింది ఫ్లోరిడా కోర్టు.
Also Read:పీఎం కిసాన్ 20వ విడత నిధులు రిలీజ్
- Advertisement -

