అనర్హత వేటుపై సుప్రీం సంచలన తీర్పు

18
- Advertisement -

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా అన్న దానిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల లోపు అనర్హత అంశాన్ని తేల్చాలని స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై తాము నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుందని.. అందుకే స్పీకర్‌కు నిర్ణయం తీసుకోమని గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. దీంతో ఇప్పుడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.

ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కొంతకాలం తరువాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Also Read:కాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర

- Advertisement -