ఇవ్వాళ్టి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర చేపట్టనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టగా పాదయాత్రలో పాల్గొననున్నారు మీనాక్షి నటరాజన్. నేటి నుంచి ఆగస్టు 4 వరకు తొలివిడత పాదయాత్ర జరగనుంది.
పరిగి నుంచి కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభంకానుంది. పరిగి పట్టణంలో బాహర్ పేట మీదుగా గాంధీ చౌక్ వరకు కొనసాగనుంది. అనంతరం పాదయాత్రను ఉద్దేశించి మీనాక్షీ నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ ప్రసంగించనున్నారు.
అనంతరం పరిగి మాజీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధాంతి పార్థసారథి నివాసంలో రాత్రి భోజనం ముగించుకుని అక్కడే బస చేయనున్నారు.మరుసటి రోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు పరిగిలోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో నిర్వహించే శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతారు..
అనంతరం ఉదయం 10 గంటలకు పరిగి పట్టణంలోని ఎస్ గార్డెన్స్ లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.
Also Read:విజయవంతంగా నింగిలోకి నిసార్

