తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ..

6
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా అన్న దానిపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది.అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటీషన్ల పై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.

ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు సార్లు పిటీషన్లపై విచారణ జరిగింది. చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసుపై ఇవాళ సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కొంతకాలం తరువాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Also Read:కాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర

- Advertisement -