విజయ్‌తో సందీప్..స్పిరిట్ అప్‌డేట్!

5
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతునన చిత్రం కింగ్డమ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీలో విజయ్ జంగటా.. భాగ్యశ్రీ భోర్సే కనిపించనుంది. 2025 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విజయ్ దేవరకొండతో ఇంటర్వ్యూ నిర్వహించారు దర్శకుడు సందీప్ వంగా. ప్రభాస్‌తో కలిసి తెరకెక్కనున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం “స్పిరిట్” ఎప్పుడెప్పుడు మొదలవుతుందో అని సందీప్‌ను ప్రశ్నించాడు విజయ్.

Also Read:ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

దీనికి స్పందించిన సందీప్ రెడ్డి వంగా…స్పిరిట్ సెప్టెంబర్ 2025 చివరి వరకు సెట్స్ మీదకు వెళ్లనుందని, ఒకసారి షూటింగ్ ప్రారంభమైతే నిరవధికంగా షూట్ కొనసాగుతుందని తెలిపారు. విజయ్ -సందీప్ కాంబోలో వచ్చిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -