హానీ ట్రాప్‌లో మహారాష్ట్ర మంత్రి!

6
- Advertisement -

హానీ ట్రాప్‌లో చిక్కుకున్నారు మహారాష్ట్ర మంత్రి. నాసిక్‌లోని ఓ లగ్జరీ హోటల్లో మహిళతో మంత్రి గడిపిన వీడియోలు లీక్ అయ్యాయి. ఈ హానీ ట్రాప్‌లో మాజీ మంత్రులతో సహా, 72 మంది సీనియర్ అధికారులు చిక్కుకున్నారని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు ఓ రాజకీయ నాయకుడు.

నాసిక్, ముంబై, పూణే, థానే వంటి నగరాల్లో హోటల్‌లో కెమెరాలు పెట్టి ఓ మహిళ, అధికారులను బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నాకా పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో నిజమేనని తేలాయి.

Also Read:వీరమల్లు సినిమాను సక్సెస్ చేయాలి!

ఆ మహిళ వెనక నాసిక్‌లోని ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన మాజీ అధికారి ఉన్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడని.. స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఎందుకు విచారణ చేయడం లేదని పలువురిలో వ్యక్తం అవుతున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -