మంత్రుల ఫోన్లు ట్యాప్‌..కేటీఆర్ ఫైర్

2
- Advertisement -

భట్టి విక్రమార్క, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… నీ సీటుకు ఎవడు ఎసరు పెడుతాడో అని చెప్పి భట్టి విక్రమార్క, పొంగులేటిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని నువ్వు మీ మనవడి మీద ఒట్టు వేసి చెప్తావా రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు.

రాష్ట్రంలో వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేయడం లేదా.. మగాడివైతే లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా – కేటీఆర్ మా జగదీష్ రెడ్డిని పట్టుకొని మూడు ఫీట్లు ఉన్నావు అంటున్నాడు.. ఈయన ఎదో అమితాబ్ బచ్చన్ అన్నట్లు అని దుయ్యబట్టారు. తిప్పి తిప్పి కొడితే నువ్వు మూడు ఫీట్లు లేవు.. మనది మనం మార్చి పోతే ఎట్లా చెప్పు ..ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా.. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా – కేటిఆర్ రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా.. శవాల మీద పేలాలు ఏరుకునేటోడివా చెప్పాలన్నారు.

Also Read:బీసీలకు రిజర్వేషన్లు.. చట్టబద్ధత కావాలి

రేవంత్ రెడ్డికి దమ్ముంటే, మగాడిలా బయటకు వచ్చి మీడియా ముందు డ్రగ్స్ అని నా మీద ఆరోపణలు చేయి… చీకట్లో కూర్చొని, దొంగలాగా చిట్ చాట్లు అంటూ నా మీద ఆరోపణలు వెయ్యడం కాదు అన్నారు. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు, దమ్ముంటే ఏ టేస్ట్ చేస్తావో చేయి కానీ కిట్టి పార్టీ ఆంటీ లాగ మీడియాని మేనేజ్ చేసి బ్రతకకు – కేటీఆర్ రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న గ్యారంటీలను వివరించారు కేటీఆర్.

1) అనుముల బ్రదర్స్ కోసం భూదందా గ్యారంటీ
2) చంద్రబాబుకు బనకచర్ల గ్యారంటీ
3) రాహుల్ గాంధీ కోసం మూటలు గ్యారంటీ
4) బావమరిది కోసం అమృత్ స్కాం గ్యారంటీ
5) ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం గ్యారంటీ
6) నెలకు 4-5 సార్లు డిల్లీకి పోవుడు గ్యారంటీ అని దుయ్యబట్టారు.

- Advertisement -