అక్రమ మైనింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరుచేస్తూ హైకోర్టు ఉత్తర్వులు పక్కన పెట్టింది సుప్రీంకోర్టు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‍ను అనుమతించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్‍పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది ధర్మాసనం.
కేసు మెరిట్స్ లోకి, పీటీ వారెంట్స్ లోకి వెళ్లట్లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది.
Also Read:KTR:అధికారం శాశ్వతం కాదు

