మన దేశం సాంప్రదాయక దేశమే అయినా.. మద్యపానంలో ఏ మాత్రం వెనుకబడి లేదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజుల్లో మన దగ్గర మద్యపానం అత్యంత సహజమైపోయింది .
గ్రామీణ, పట్టణ, నగర స్థాయిల్లో.. ఎక్కడైన మద్యం సహజ సేవనం దగ్గరకు వచ్చేసింది. మరి ఈ విషయంలో భారతీయ యువత టేస్ట్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఒక అధ్యయనం. మద్యం మత్తును ఇష్టపడుతున్న యువత ఏ రూపంలో ఆల్కాహాల్ ను తీసుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తోంది? అనే అంశంపై ఈ అధ్యయం సాగింది.
ఈ అధ్యయనంలో తేలింది ఏంటంటే..ఇండియన్ యూత్ ‘బీర్’ను బాగా ఇష్టపడుతోందని. భారతీయులకు ఇష్టమైన మద్యం ‘బీర్’అని, ఈ రూపంలో ఆల్కాహాల్‌ను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని ఈ అధ్యయనం తేల్చింది. ఇది నగరాల్లో చేసిన సర్వే. దాదాపు లక్షమంది డ్రింకర్ల అభిప్రాయాలను తీసుకుని ఈ అధ్యయనాన్ని పూరించారట.
దేశంలోని ప్రధాన నగరాల్లోని వారిని సంప్రదించి తేల్చింది ఏమిటంటే.. 47 శాతం మంది డ్రింకర్లు తాము ‘బీర్’తాగడానికే ఇష్టపడతామని స్పష్టం చేశారట.
విస్కీ, వైన్, రమ్.. ఇలా భిన్నమైన ద్రవ రూపాల్లో మద్యం అందుబాటులో ఉంటుందని వివరించనక్కర్లేదు. వీటన్నింటిలోకెళ్లా బీర్ రూపంలో మద్యాన్ని తీసుకోవడానికే ఇండియన్స్ ఆసక్తితో ఉన్నారని, బీర్ నే మెజారిటీ డ్రింకర్లు ఇష్టపడుతున్నారని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.
బీర్ సేవనంలో బాగా ముందున్నా నగరాలు బెంగళూరు, గుర్గావ్ లు. ఈ సిటీల్లో 57 శాతం మంది బీర్‌పై తమ ఇష్టాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో 32 శాతంమంది, ముంబైలో 33 శాతం మంది బీర్‌ను ఇష్టపడుతున్నారు.
ఆ నగరాల్లో మాత్రం మెజారిటీ డ్రింకర్లు విస్కీ, వైన్, ఓడ్కా, రమ్ లను ఇష్టపడుతున్నారు. సగటున మాత్రం 47 శాతం మంది నగరపౌరుల ఎంపికలో ప్రథమ ప్రాధాన్యం మాత్రం బీర్‌కే..!