ఈబీ-5 వీసానే బెస్ట్..

197
Indians can depend on EB-5 Visas
- Advertisement -

హెచ్‌1బీ వీసాల మీద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ నివసిస్తున్న భారతీయుల గుండెల్లో దడ పుట్టిస్తు‍న్న సంగతి తెలిసిందే.

 Indians can depend on EB-5 Visas

అమెరికా కలలు కల్లలు కాకుండా ఉండటానికి భారతీయులకు బెస్ట్ వీసాగా ఈబీ-5 వీసా ఉన్నట్టు అమెరికా ఇమ్మిగ్రేషన్ లాయర్ చెప్పారు. అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలనుకునేవారికి ఇది ఓ ఆశాకిరణంగా పేర్కొన్నారు. ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన అమెరికా ఇన్వెస్ట్ మెంట్ ఇమ్మిగ్రేషన్ అటార్ని వాఘన్ డీ కిర్బీ, తమ సంస్థ విజయవంతంగా 1,300 ఈబీ-5 అప్లికెంట్లను కలిగి ఉందని చెప్పారు.

 Indians can depend on EB-5 Visas

ఈ ప్రోగ్రాం ద్వారా అమెరికాలో పెట్టుబడులు పెడితే చాలు సదరు వ్యక్తి, అతని కుటుంబంతో సహా జీవితకాలం అమెరికాలోనే ఉండొచ్చని తెలిపారు. అయితే వారి పిల్లల వయసు 21 ఏళ్ల కంటే తక్కువగా ఉండాలి.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉద్యోగాల కల్పన ద్వారా ఊతమిచ్చేందుకు 1990లో అప్పటి ప్రభుత్వం 1990లో ఈబీ-5కి రూపకల్పన చేసింది. ఈబీ-5 కాలపరిమితి ఏప్రిల్‌లో ముగియనుంది.

 Indians can depend on EB-5 Visas

అయితే ఈబీ-5 ఇన్వెస్ట్ మెంట్ వీసా ప్రొగ్రామ్ కింద అప్లికెంట్ అమెరికాలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడైతేనే గ్రీన్ కార్డు పొందుతారు. అదేవిధంగా శాశ్వత గ్రీన్ కార్డు పొందిన తర్వాత కూడా 10మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించగలగాలి.

భారతీయులకు ఈ వీసా కేటగిరీ ప్రాసెసింగ్ సమయం కేవలం 18నెలలే పడుతుందని కిర్బీ చెప్పారు. గత కొంతకాలంగా ట్రావెల్ నిషేధం, హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు, విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిపై ఆంక్షలు ఈబీ-5 వీసా దరఖాస్తులపై మరలుస్తోంది. అమెరికాలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి, పనిచేయడానికి, ఈబీ-5 వీసానే సరియైనది కిర్బీ తెలిపారు.

- Advertisement -