ఇదేనా ప్రజాపాలనా?:గాదరి కిశోర్

5
- Advertisement -

ఇది ప్రజా పాలనా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టుల పాలనా చెప్పాలని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్  ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
తుంగతుర్తి పర్యటనకు రేవంత్ వస్తున్నాడని నిన్న అర్ధరాత్రి నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకి తరలించారు పోలీసులు. ఈ సందర్బంగా గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. కాళేశ్వరం గోదావరి జలాలు ఇవ్వక, రైతు భరోసా రాక, రుణమాఫీ చేయక, ఎరువులను సకాలంలో అందించకుండా రైతులన్నలను అరిగోసకు గురిచేస్తున్న రేవంత్ రెడ్డి తుంగతుర్తికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు చెప్పాలన్నారు.

ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి, అమలు చేసే సత్తా లేక ప్రశ్నించే వారిపై హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీల గురించి ప్రజల పక్షాన పోరాటం చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ నాయకులు అదిరేది లేదు, బెదిరేది లేదు. మాకు పోరాటాలు, ఉద్యమాలు, కేసులు, జైళ్లు అరెస్టులు కొత్త కావు అన్నారు. పోలీసుల బలం ఉపయోగించి, ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికం అన్నారు.

Also Read:లోకల్ బాడీ ఎన్నికల్లో చెప్పులు చూపించండి!

- Advertisement -