విడిపోతున్నట్లుగా ప్రకటించారు బ్యాడ్మింటన్ స్టార్ జంట సైనా నెహ్వాల్, కశ్యప్ పారుపల్లి. తన భర్త పరుపల్లి కశ్యప్‌తో విడిపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు నెహ్వాల్. దీంతో కశ్యప్‌తో ఆమె ఏడేళ్ల వివాహ జీవితాన్ని ముగించారు. సైనా తన వ్యక్తిగత విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఈ వార్త క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
సైనా నెహ్వాల్, పరుపల్లి కశ్యప్ 2018 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. జీవితం కొన్నిసార్లు మనల్ని వేరే దారుల వైపు తీసుకెళ్తుంది. చాలా ఆలోచనలు, ఆత్మపరిశీలన తర్వాత, నేను మరియు కశ్యప్ పరుపల్లి విడిపోయే నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు సైనా నెహ్వాల్. మేమిద్దరం ప్రశాంతత కోరుకుంటున్నాం.. ముందు ముందు కశ్యప్‌కి మంచే జరగాలని కోరుకున్నారు సైనా. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించి, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
సైనా మరియు కశ్యప్ ఇద్దరూ చిన్నతనంలో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ ప్రారంభించారు. 2008లో BWF వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత సైనా నెహ్వాల్ గుర్తింపు పొందింది. అదే సంవత్సరంలో ఆమె ఒలింపిక్స్‌కు అర్హత సాధించి క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా నిలిచింది. 2012లో ఆమె తన మొదటి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది.2009లో అర్జున అవార్డు, ఇప్పటికీ ప్రపంచ నెం.1 ర్యాంక్‌ను సాధించిన ఏకైక భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచింది.
పరుపల్లి కశ్యప్ 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచారు . 32 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష షట్లర్ అయి నిలిచారు. 2012 ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్ వరకు చేరిన మొదటి భారత పురుషుడిగా కూడా చరిత్ర సృష్టించారు. 2013లో ప్రపంచ నెం.6 ర్యాంక్‌ను అందుకున్నారు.2024లో కశ్యప్ బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు చెప్పి కోచింగ్ వైపు మళ్లారు.
Also Read:ఈ ఏడాది భారీ వర్షాలు: స్వర్ణలత ‘రంగం’

