- Advertisement -
నేడు భూమి మీదకు తిరిగిరానున్నారు వ్యోమగామి శుభాంశు శుక్లా. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 వ్యోమనౌక ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లింది శుక్లా బృందం. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.35 గంటలకు అన్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కాలిఫోర్నియా తీరంలో దిగనుంది క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. దీంతో భూమి మీదకు తిరిగిరానున్నారు శుభాంశు, పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్ కీ-విస్నియొస్కీ, టిబర్ కపు.
ఐఎస్ఎస్ లో 18 రోజులపాటు వివిధ ప్రయోగాలు చేశారు శుభాంశు శుక్లా. వ్యోమగాములు భూమిపై వాతావరణానికి అలవాటుపడేందుకు ఇస్రో ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారం రోజులపాటు రిహాబిలిటేషన్ సెంటర్లో ఉండనున్నారు వ్యోమగాములు.
Also Read:మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు
- Advertisement -

