నటి సరోజా దేవి కన్నుమూత

6
- Advertisement -

టాలీవుడ్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ నటి బి. సరోజాదేవి (87) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సరోజాదేవి బెంగళూరులోని తన నివాసంలో మరణించారు. ఆరు దశాబ్దాలుగా తెలుగుతో సహా వివిధ భాషలలో నటించింది.

1938 జనవరి 7న జన్మించారు సరోజా దేవి. 17 సంవత్సరాల వయసులో వెండితెరపై అడుగుపెట్టింది. 1955లో వచ్చిన మహాకవి కాళిదాసు తొలి సినిమాతోనే జాతీయ అవార్డును గెలుచుకుంది సరోజా దేవి. సరోజా దేవికి 2008లో భారత ప్రభుత్వం నుండి జీవిత సాఫల్య పురస్కారం, 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్‌ను అందుకుంది.

పాండురంగ మహత్యం సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేక వీరుని కథ, శ్రీ సీతారామ కళ్యాణం, మంచి చెడు, శ్రీ కృష్ణార్జున యుద్దం.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సరోజా దేవి తెలుగు, కన్నడ, తమిళం, హిందీ సినిమాల్లో నటించారు.

Also Read:మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -