TTD:పుస్తక ప్రసాదం

6
- Advertisement -

భక్తులకు చేరువయ్యేందుకు టీడీపీ మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచేందుకు పుస్తక ప్రసాదం అందించాలని నిర్ణయించింది.

త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి మహత్యాలు, ఇతర దేవతామూర్తుల స్తోత్రాలు, భజనలు, పవిత్ర గాథలు, భగవద్గీత వంటి పుస్తకాలను భక్తులకు అందించనున్నారు.

Also Read:‘కాంతార: చాప్టర్ 1’..రిలీజ్ డేట్

దాతల నుంచి అందే విరాళాలతో ఈ పుస్తకాలను ముద్రించి, పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతీ గ్రామంలో ఈ పుస్తకాలను పంచాలని భావిస్తున్నారు.

- Advertisement -