14 దేశాలపై ట్రంప్ టారీఫ్!

6
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరే దశలో ఉన్నామని చెబుతూనే 14 దేశాలపై కొత్త టారీఫ్‌లను ప్రకటించారు.

యునైటెడ్ కింగ్‌డమ్, చైనాతో ఒప్పందం చేసుకున్నాం. భారత్‌తో ఒప్పందం దగ్గరలో ఉంది. మరికొంతమందితో సమావేశమైనా ఒప్పందం కుదరకపోవచ్చు అని భావిస్తున్నాం. అందుకే వారికీ లేఖ పంపిస్తాం అని తెలిపారు.

మొదటగా జపాన్ ప్రధాని శిగేరు ఇషిబా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మియంగ్‌లకు పంపిన లేఖల్ని విడుదల చేశారు. అనంతరం మలేషియా, కజఖస్తాన్, దక్షిణాఫ్రికా, మయన్మార్, లావోస్‌లకు పంపిన లేఖల వివరాలను వెల్లడించారు.తరువాత థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ట్యునీషియా, బోస్నియా & హెర్జెగోవినా, సెర్బియా, కంబోడియా దేశాలకూ లేఖలు పంపారు.

థాయిలాండ్, కంబోడియా దేశాలకు 36% టారీఫ్, బంగ్లాదేశ్, సెర్బియా: 35%,మలేషియా, కజఖస్తాన్: 25%,మయన్మార్, లావోస్: 40%,ఇండోనేషియా: 32%,దక్షిణాఫ్రికా, బోస్నియా & హెర్జెగోవినా: 30%,ట్యునీషియా: 25%,జపాన్, దక్షిణ కొరియా: 25% టారీఫ్ విధించనున్నట్లు తెలిపారు. ఆ దేశాలు తమ వాణిజ్య విధానాలు సవరిస్తే తాము కూడా తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. టారిఫ్ డెడ్‌లైన్‌ను ఆగస్ట్ 1కి వాయిదా వేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు ట్రంప్.

Also Read:‘కాంతార: చాప్టర్ 1’..రిలీజ్ డేట్

- Advertisement -