- Advertisement -
స్టూడెంట్స్ ని కొట్టాడని టీచర్లపై పేరెంట్స్ దాడి చేశారు. ఈ ఘటన బీహార్ లోని గయా జిల్లాలో చోటుచేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది.
వారిని వారించి చెంపదెబ్బ కొట్టాడు టీచర్ రాకేశ్ రంజన్. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు. స్కూల్ కు వచ్చి కర్రలతో రాకేశ్ ను చితకబాదారు పేరెంట్స్.
అడ్డువచ్చిన మరో ఉపాధ్యాయుడిపైనా దాడి చేశారు. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
- Advertisement -

