- Advertisement -
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రుద్రాక్ష మొక్క నాటారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పీసీసీఎఫ్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్… కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.
పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరండి అని పిలుపునిచ్చారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు రుణాలు అందించాం అని… అన్ని రంగాల్లో ఆడబిడ్డలను ముందు భాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నాం అన్నారు.
ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడాలనేదే మా ప్రభుత్వ ధ్యేయం అని.. ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో నిలబెట్టి, ఆడబిడ్డలను రక్షించడమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం అని తెలిపారు.
Also Read:సోషల్ మీడియా పోస్టులు..అత్యుత్సాహం వద్దు!
- Advertisement -

