వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్

8
- Advertisement -

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ లభించింది. వంశీ బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది కూటమి ప్రభుత్వం. ఇవాళ సుప్రీంలో విచారణ జరుగగా ఈ పిటిషన్‌ను కొట్టేసింది.

అక్రమ మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అక్రమ మైనింగ్ పై సమగ్ర దర్యాప్తు ఇవ్వాలని, విచారణకు ఈనెల 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అలాగే గన్నవరం ప్రైవేట్ స్థల వివాదంలో వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది.

సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా ఎలా మారుస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్‌కు కొట్టేసింది. ఇప్పటికే హైకోర్టులో వంశీపై ఉన్న అన్నీ కేసుల్లో బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ వంశీ జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read:మేడారం మహాజాతర..తేదీలివే

- Advertisement -