రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయి అని మండిపడింది హైకోర్టు. సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోవద్దని చెబితే పోలీసులకు అర్థం కాదా? అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సివిల్ కేసుల సెటిల్మెంట్లు తారా స్థాయికి చేరుతున్నాయని, వెంటనే పోలీసులకు కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ వో పీ) రూపొందించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నాగోల్ సర్కిల్ బండ్లగూడకు చెందిన వ్యక్తిని, ఒక భూ వివాదాన్ని రియల్ ఎస్టేట్ ఏజెంట్ తో రూ.55 లక్షలకు సెటిల్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ జూన్ 19వ తేదీన పోలీస్ స్టేషన్లో నిర్భంధించారు పోలీసులు.
దీంతో బాధితుడు హైకోర్టులో వేసిన పిటిషన్ ను విచారిస్తూ, పిటిషనర్ కు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ అతనిపై దౌర్జన్యం చేస్తారా అంటూ రాచకొండ కమిషనర్, నాగోల్ పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. పోలీసులు సివిల్ కేసుల తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారని, కేసు కోర్టులో ఉన్న తరువాత పోలీసుల జోక్యం ఎందుకని అధికారులను నిలదీశారు హైకోర్టు.
Also Read:గోవిందరాజస్వామి ఆలయంలో పుష్పయాగం

