- Advertisement -
ఏపీలో టీడీపీకి షాక్ తగిలింది. అన్నమయ్య జిల్లాలో పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతలే తనను ఓడించారని బాలసుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమకు పార్టీ కాదు కార్యకర్తలే ముఖ్యమన్న బాలసుబ్రమణ్యం సోదరుడు ప్రసాద్ బాబు కూడా తెలిపారు. వచ్చే ఎన్నిక్లలో రాయచోటి నుంచి పోటీ చేసి తీరుతామంటూ ప్రకటించారు.
తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు బాలసుబ్రమణ్యం. టీడీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచారు పాలకొండ్రాయుడు.
Also Read:కేసీఆర్… తెలంగాణ సూర్యుడు
- Advertisement -

