ఆయిల్ పామ్ సాగుకు హబ్‌గా ఖమ్మం జిల్లా మారనుందని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారులతో పామాయిల్ సాగుపై చర్చించారు.
పామాయిల్ సాగుకు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆయిల్ పామ్ పంటకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇది రైతులకు స్థిర ఆదాయం కలిగించే లాంగ్‌టర్మ్ పంట అని తెలిపారు. ప్రతి రైతుకు పామాయిల్ మొక్కలు అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగవుతున్న పామాయిల్ పంటను చూసి రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోవాలి అని ఇది కేవలం పంట కాదు, భవిష్యత్ ఆదాయానికి బలం అని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మండల స్థాయి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read:ఉస్తాద్ భగత్‌సింగ్..సాలిడ్ అప్డేట్!

