పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం

7
- Advertisement -

పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక కామెంట్ చేశారు. కేంద్ర ఆర్థికశాఖకు పూర్తి వివరాలు అందించనున్నారు రాష్ట్ర అధికారులు. రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టును ప్రతిపాదిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రైతులు, ప్రజలకు ప్రయోజనాలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు అధికారులు.

ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖల అధికారులు. గత నెల జరిగిన భేటీల్లో ప్రధాని, ఆర్థికమంత్రికి వివరించారు సీఎం చంద్రబాబు.

సీఎం ప్రతిపాదనపై పూర్తి వివరాలు ఇవ్వాలని గతంలో కోరింది కేంద్ర ఆర్థికశాఖ. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్‍కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి పీయూష్ కుమార్. ప్రాజెక్టు సమగ్ర వివరాలను కేంద్ర ఆర్థికశాఖకు వివరించనున్నారు అధికారులు. ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలు, నీటి పంపిణీ, భూసేకరణపై వివరాలు అందించనుంది ఏపీ ప్రభుత్వం.

భవిష్యత్తులో స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని వివరించనున్నారు అధికారులు. తెలంగాణ అభ్యంతరాలపైనా ప్రజెంటేషన్‍లో సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. వృథా నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం. సుమారు 2 వేల టీఎంసీల నీటి వినియోగంపై ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ ఉన్న తెలంగాణకూ ఉపయోగమేనని… తెలంగాణ రాష్ట్ర నీటిని తామేమీ తీసుకోవడం లేదన్నారు సీఎం.

Also Read:నాలుగు కోట్ల ప్రజలకు విముక్తి లభించిన రోజు!

- Advertisement -