బీసీసీఐ తాత్కాలిక ఛైర్మన్గా రాజీవ్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం బీసీసీఐ చీఫ్గా ఉన్న రోజర్ బిన్నీ తప్పుకోనుండటంతో ఆయన స్థానంలో జులై తాత్కాలిక అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
రోజర్ బిన్నీ వయస్సు 70 సంవత్సరాలు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవికి గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలు కాగా నిబంధనల మేరకు ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
రోజర్ బిన్నీ అక్టోబర్ 2022లో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. గంగూలీ తన మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోగా.. బిన్నీ ఒక్కడే పదవికి పోటీపడ్డారు. బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడైన తర్వాత.. భారత్ రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఐసీసీ టోర్నమెంట్లను గెలుచుకుంది.
Also Read:నాలుగు కోట్ల ప్రజలకు విముక్తి లభించిన రోజు!

