నాలుగు కోట్ల ప్రజలకు విముక్తి లభించిన రోజు!

7
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు. సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు అన్నారు.

తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్‌ సచ్చుడో.. కేసీఆర్‌ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో అంటూ నినదించిన కేసీఆర్..గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువ లేనివి. వారికి జోహార్లు అని తెలిపారు.

 

Also Read:ఓటీటీలో ‘చౌర్య పాఠం’..

- Advertisement -