కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఉమ్మడి చిత్తూరుజిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు అని ఎక్స్ వేదికగా తెలిపారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు అన్నారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు అని కితాబిచ్చారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.
ఉమ్మడి చిత్తూరుజిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను… pic.twitter.com/bLVmxQPfdM
— Lokesh Nara (@naralokesh) May 22, 2025
Also Read:వడగళ్ల వర్షం..విమానం ధ్వంసం!

