రేవంత్ చేసిన తప్పిదాన్ని సరిచేసుకోవాలి:వినోద్ కుమార్

7
- Advertisement -

మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారు తెలంగాణలో వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నారు… నాగార్జున సాగర్,ఛార్మినార్,చౌమొహల్లా ప్యాలెస్,వెయ్యి స్తంభాల డి,రామప్ప గుడి, యాదగిరి గుట్టను దర్శించు కున్నారు అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్.. రామోజీ ఫిల్మ్ సిటీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటెరియట్ భవనాన్ని పరిశీలించారు అన్నారు.

ప్రపంచంలో గొప్పగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకున్నాం.. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన పోటీదారులను 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు తీసుకువెళ్ళలేదు అన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు మిస్ వరల్డ్ పోటీదారులను తీసుకువెళ్లకుండా రేవంత్ రెడ్డి ఎందుకు విస్మరించారు చెప్పాలన్నారు.

అంబేద్కర్ జీవిత చరిత్రను మిస్ వరల్డ్ పోటీదారులకు వివరించాలి… రేవంత్ రెడ్డి చేసిన తప్పిదాన్ని సరిచేసుకోవాలి అన్నారు. జూన్ 2వ తేదీన మిస్ వరల్డ్ విజేతలు,పోటీదారులను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లే ముందు అమరజ్యోతిని చూపించాలి అన్నారు. కాళేశ్వరం కమీషన్ నోటీసులపై వినోద్ కుమార్ స్పందించారు. కమీషన్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.. ఏం నోటీసులు ఇచ్చారు,నోటీసుల్లో ఏముందో తెలిసిన తర్వాత స్పందిస్తానని చెప్పారు.

Also Read:ఎన్టీఆర్ బర్త్ డే..War2 టీజర్

- Advertisement -