ఓదెల 2…ఓటీటీలో సరికొత్త రికార్డు!

9
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన చిత్రం ఓదెల 2. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ చిత్రంకు అద్భుత రెస్పాన్స్ వస్తోంది. విడుదలై రెండు వారాలు గడుస్తున్న ఇప్పటికి ఓటీటీలో ట్రెండింగ్‌గానే ఉంది.

ఓర్‌మ్యాక్స్ మీడియా విడుదల చేసిన తాజా రిపోర్టు ప్రకారం (2025 మే 12 నుంచి 18 మధ్య గణాంకాలు),ఓదెల 2 దేశవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. ప్రేక్షకుల నుండి చిత్రం ఎంతటి ఆదరణ పొందిందో తెలియజేస్తోంది.

తమన్నా నటన అందరిని ఇంప్రెస్ చేయగా వశిష్ట ఎన్. సింహా, హెబా పటేల్, మురళీ శర్మ తదితర నటీనటులు కథను బలంగా ముందుకు నడిపించారు. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రచయితగా, సహ-నిర్మాతగా సంపత్ నంది వ్యవహరించారు. అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, థ్రిల్లర్ మూడ్‌కు పూర్తి న్యాయం చేయగా డి. మధు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read:గుల్జార్ హౌస్ ప్రమాదం..ఉన్నతాధికారులతో కమిటీ

- Advertisement -