- Advertisement -
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 50 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీయనుండగా ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
Also Read:నీరజ్ చోప్రా…సరికొత్త రికార్డు
- Advertisement -

