తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా ఈ క్రింది బాధ్యులను వివిధ భాద్యతలలో నియమించడం జరిగిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నూతన బాధ్యులు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించడమైనది. వీరి నియమకాలు వెంటనే అమలులోకి వస్తాయి అని వెల్లడించారు.
తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య – రాష్ట్ర కన్వీనర్ – శ్రీమతి మరిపెల్లి మాధవి
తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య – రాష్ట్ర కన్వీనర్ – శ్రీ ఎదురుగట్ల సంపత్ గౌడ్
తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ – శ్రీ అప్పాల నరేందర్ యాదవ్
తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య – రాష్ట్ర కన్వీనర్ – శ్రీ జానపాటి రాము యాదవ్
తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య – హైదరాబాద్ కన్వీనర్ – శ్రీ పరకాల మనోజ్ గౌడ్
Also Read:TG:రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు
తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యం చేసినందుకు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ జాగృతి యువజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్.
జాగృతి సంస్థ గత నిర్మాణంలో శక్తివంచన లేకుండా పనిచేస్తాను… జాగృతి అధ్యక్షురాలు కవిత ఆశయాలకు అనుగుణంగా, జాగృతి అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తాను అని తెలిపారు.

