భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. తొలిసారి తన కెరీర్ లో 90 మీటర్ల మార్కును అధిగమించాడు నీరజ్ చోప్రా. ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్ మూడో రౌండ్ లో 90.23 మీటర్లు విసిరాడు నీరజ.
అయితే జర్మనీ ప్లేయర్ వెబర్ చివరి రౌండ్ లో 91.06 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలువగా నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తన మూడో ప్రయత్నంలో 90 మీటర్ల మార్క్‌ను దాటి 90.23 మీటర్లు విసిరి సత్తాచాటాడు.
2024లోనే నీరజ్, 90 మీటర్ల మార్క్ దాటాలని తన మనస్సులో ఎప్పుడూ ఉందని, దానిని అధిగమించాలనే తపన తనకు ఉందని పేర్కొన్నారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత అయిన నీరజ్ తన ఖాతాలో 88–89 మీటర్ల గీతను అనేకసార్లు దాటారు. కానీ 90 మీటర్ల మార్క్ క్రాస్ చేయలేకపోయాడు. అయితే దోహా డైమండ్ లీగ్‌లో ఆ లోటును భర్తీ చేశాడు.
Also Read:హరిహర వీరమల్లు..రిలీజ్ డేట్ పిక్స్

