రాజీవ్ యువ వికాసం పథకంలో గందరగోళం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులపై గందరగోళం నెలకొంది. మొదట దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఇవ్వాలని చెప్పి, తరువాత జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో మాన్యువల్ గా ఇవ్వాలని పేర్కొన్నారు అధికారులు.
జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు, పత్రాలు సమర్పించాక, తహసీల్దార్ కార్యాలయం నుండి ఫోన్ చేసి మరొకసారి దరఖాస్తులు ఇవ్వమని అభ్యర్థులకు ఫోన్ చేశారు సిబ్బంది.
జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చిన తరువాత మళ్ళీ తహసీల్దార్ కార్యాలయంలో పత్రాలు ఇవ్వమని అడగడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు దరఖాస్తుదారులు. అంతకముందు ఇచ్చిన దరఖాస్తులు ఉన్నాయా చెత్త బుట్టలో పడేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దరఖాస్తుదారులు.
Also Read:TTD:18న స్వర్ణ రథోత్సవం

