- Advertisement -
హైదరాబాద్ బిర్యానీలో బల్లి కలకలం రేపింది. మెహఫిల్ బిర్యానీలో బల్లి రాగా ఇదేమిటని అడగగా మంచిగా ఫ్రై అయింది తినమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు యజమాని. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో కస్టమర్ చికెన్ బిర్యానీ తింటుండగా బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది.
బల్లి రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు కస్టమర్. ఇదేమిటని రెస్టారెంట్ యజమానిని నిలదీయడంతో మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు బాధితుడు కృష్ణారెడ్డి.
షేరిగూడ గ్రామం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మేనేజర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు పోలీసులు.
Also Read:TTD:18న స్వర్ణ రథోత్సవం
- Advertisement -

