చంద్రయాన్ 5 ప్రయోగానికి భారత్ అడుగులు వేసింది. చంద్రయాన్ -5 కి ఆమోదం తెలిపింది కేంద్రం. చంద్రయాన్-3 లో 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడిపై దించింది ఇస్రో.
చంద్రయాన్-5 లో 250 కిలోల రోవర్ ను చంద్రుడిపై దించేందుకు ప్లాన్ చేస్తోంది. జపాన్ సహకారంతో చంద్రయాన్ -5 మిషన్ చేపట్టనుంది ఇస్రో. జపాన్ అంతరిక్ష సంస్థతో ఇస్రో అధికారులు భేటీ అయ్యారు. మే 13, 14న ఇస్రో అధికారులతో JAXA ప్రతినిధులలు చర్చించనున్నారు.
చంద్రయాన్-5 మిషన్‌ను జాక్సా వారి H3-24L వాహనంతో ప్రయోగించనున్నారు. దీనిలో ఇస్రో తయారు చేసిన ల్యాండర్ ఉంటుంది. ఆ ల్యాండర్‌లో మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ (ఎంహెచ్ఐ) రూపొందించిన రోవర్‌ను ఉంచనున్నారు.
2025 మార్చి 10న కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చంద్రయాన్-5/ల్యూపెక్స్ మిషన్, భారతదేశ చంద్రుని అన్వేషణ ప్రణాళికలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.
Also Read:TTD:18న స్వర్ణ రథోత్సవం

