ధాన్యం కొనుగోళ్లపై భరోసా ఏది?:హరీష్

10
- Advertisement -

కనిపెంచిన పిల్లలు కళ్ళ ముందే కనుమరుగు అయినట్టు,ఇంటి దూలం ఇరిగి ఒక్కసారిగా భుజం మీద పడ్డట్టు,ఆరుగాలం శ్రమించి పండించిన పంట గాలి వానకు తడిసి ముద్ద అయితే అన్నదాతకు ఎంత యాతనా, ఎంత కడుపు కోత? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు.

రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా కన్నీటి వేదనే మిగిలిందన్నారు. పోలీసు పహారా మధ్య, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సమీక్షలు చేసే ఓ తెలంగాణ సీఎంవో.. ఇకనైనా కండ్లు తెరవండి అన్నారు.

తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇవ్వండి. కొనుగోళ్ళు వేగంగా జరిపి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయండి. దేశానికే అన్నం పెట్టే రైతుల బతుకులు కాపాడండి అని కోరారు.

 

Also Read:బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందమా?:కేటీఆర్

- Advertisement -