జగదేక వీరుడు అతిలోక సుందరి.. ఆసక్తికర విషయాలు!

18
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైం హిట్ సినిమాల్లో ఒకటి జగదేకవీరుడు అతిలోక సుందరి. కే రాఘవేంద్ర దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించగా చిరు, శ్రీదేవి ప్రధాన పాత్రను పోషించారు. ఇక ఈ సినిమా విడుదలై 35 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా సినిమా గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు.

ఈ సినిమా కోసం 27 మంది రైటర్స్ పనిచేశారని తెలిపారు చిరు. అంతేగాదు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ సినిమా కోసం ప్రతీ పాట మూడు, నాలుగు గంటల్లో కంపోజ్ చేసేశారు అన్నారు. ఈ సినిమా రీ-రిలీజ్‌లో శ్రీదేవీ ని చాలా మిస్ అవుతున్నాం. ఈ రీ-రిలీజ్ ఆమెకు అంకితం అని తెలిపారు. ఇప్పటి తరం ఈ రీ-రిలీజ్‌ను చూడండి. మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్లి సినిమాను చూడండి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అన్నారు.

అశ్వనీదత్ మాట్లాడుతూ.. జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి ఎప్పుడు తలుచుకున్నా కంట్లోంచి ఆనంద భాష్పాలు వస్తుంటాయి అన్నారు. చిరంజీవి గొప్ప వ్యక్తి….జగదేక వీరుడు అతిలోక సుందరి కోసం ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాలు సినిమాకు దోహదపడ్డాయ’ని అన్నారు.

Also Read:పాక్ డ్రోన్ దాడిని తిప్పికొట్టిన భారత సైన్యం

జగదేక వీరుడు అతిలోక సుందరి అనేది ఓ డ్రీమ్ టీం…చిరంజీవి , శ్రీదేవీ , అశ్వనీదత్ , రాఘవేంద్రరావు , ఇళయారా , విన్సెంట్ , యండమూరి ఇలా మహామహులంతా కలిసి ఈ మూవీ కోసం పనిచేశారన్నారు. మళ్లీ ఇలాంటి ఓ టీం కలిసి ఇలాంటి ఓ క్లాసిక్ మూవీని తీయలేదు. ఇకపై తీయలేరు కూడా. మా జనరేషన్‌కు డ్రీమ్ టీం అంటే ఇదేనన్నారు.

- Advertisement -