తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

23
- Advertisement -

తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

ఈ నెల 6న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రిలో పడతాయని తెలిపింది.

కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల వర్సాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాయలసీమ ప్రాంతం ఎక్కువ వేడిగా ఉండే అవకాశముంది, చాలా చోట్ల 40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.

ముఖ్యంగా నంద్యాల, కడప, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల 42-43°C వరకు నమోదు కావచ్చు అని… విశాఖపట్నం గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 34°C ఉండే అవకాశం ఉందిని…ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని తెలిపింది.

Also Read:యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు

- Advertisement -