వివాదంలో హీరో విజయ్ దేవరకొండ!

16
- Advertisement -

హీరో విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నారు. విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్.

ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన విజయ్ ఉగ్రదాడిని ఖండించారు. ఇదే క్రమంలో 500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి అంటు కామెంట్ చేశారు విజయ్.

గిరిజన జాతిని అవమాన పరుస్తూ మాట్లాడాడని హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసింది ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్. మరి దీనిపై విజయ్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

Also Read:హైదరాబాద్‌లో టమాటో ఫెస్టివల్

- Advertisement -