పహల్గామ్ దాడి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా పిటిషనర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిటిషన్ వేసేముందు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపింది సుప్రీంకోర్టు. దేశంపై బాధ్యత లేదా అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని అసహనం వ్యక్తం చేసింది.
మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గామ్‌లోని 3 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు ఉగ్రవాదులు. ఏప్రిల్ 15న జమ్మూకశ్మీర్‌లోని అమ్యూజ్‌మెంట్ పార్క్ దగ్గర ఉగ్రవాదుల రెక్కీ నిర్వహించగా భారీ భద్రత ఉండటంతో దాడి ప్లాన్ విరమించుకున్నారు. అలాగే జమ్ములో రద్దీగా ఉండే మరో 2 ప్రాంతాల్లోనూ రెక్కీ నిర్వహించినట్లు గుర్తించాయి భద్రత బలగాలు.
Also Read:శ్రామికులకు అండగా ఉన్నాం: కేసీఆర్

